నాడు-నేడు పనుల పరిశీలన

ABN , First Publish Date - 2021-07-14T06:02:31+05:30 IST

నాడు-నేడు పనుల పరిశీలన

నాడు-నేడు పనుల పరిశీలన
ఆముదాలపల్లి ఎంపీపీ పాఠశాలలో నాడు-నేడు పనులు పరిశీలిస్తున్న ఎంపీడీవో కె.జ్యోతి

ఉంగుటూరు, జూలై 13 : పాఠశాలల్లో పెండింగులో వున్న నాడు-నేడు పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఎంపీడీవో కె.జ్యోతి సూచించారు.   ఆముదాలపల్లి ఎంపీపీ పాఠశాలను మంగళవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాల్లో నాడు-నేడుకింద జరుగుతున్న పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీపడొద్దని చెప్పారు. పచ్చని మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం వుండేలా పాఠశాలలను తీర్చిదిద్దాలని హెచ్‌ఎంలకు సూచించారు.  

ఫ మండలంలోని నందమూరు, లంకపల్లి, బొకినాల ఎంపీయూపీ పాఠశాలలు, ఆత్కూరు జడ్పీ ఉన్నత పాఠశాలను ఈవోపీఆర్డీ విజయకుమార్‌ మంగళవారం సందర్శించి, నాడు-నేడు కింద జరుగుతున్న పనుల నాణ్యతను పరిశీలించారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శులు టి.శివ ప్రసాద్‌, జి.సత్యసాయిబాబు, ఆయా పాఠశాలల హెచ్‌ఎంలు, సచివాలయాల ఇంజనీరింగ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - 2021-07-14T06:02:31+05:30 IST