భర్తే హంతకుడు

ABN , First Publish Date - 2021-11-23T06:37:30+05:30 IST

భర్తే హంతకుడు

భర్తే హంతకుడు
పుట్రేల ఎన్‌ఎస్పీ కెనాల్‌ వద్ద జరిగిన వివాహిత హత్య కేసు వివరాలు వెల్లడిస్తున్న సీఐ

విస్సన్నపేట, నవంబరు 22: పుట్రేల శివారు ఎన్‌ఎస్పీ కెనాల్‌ వద్ద ఈనెల 19న వివాహిత ముదురుకోళ్ల మాణిక్యం(40)ను భర్త నాగేశ్వరరావు హత్య చేసినట్లు నిర్ధారణ అయిందని తిరువూరు సీఐ ఎం.శేఖర్‌బాబు సోమవారం పోలీస్‌స్టేషన్‌లో విలేకరుల సమావేశంలో తెలిపారు. భార్యపై అనుమానంతో పథకం ప్రకారం బయటకు తీసుకువెళ్లి బండరాయితో ఆమె తలపై మోది హత్య చేసినట్టు భర్త తహసీల్దార్‌ ముందు అంగీకరించి, లొంగిపోయాడని తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసి కోర్టుకు తరలించినట్లు చెప్పారు. ఎస్సై పి.కిషోర్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-23T06:37:30+05:30 IST