ఒంటరి వృద్ధురాలి హత్య

ABN , First Publish Date - 2021-08-27T06:21:27+05:30 IST

ఒంటరి వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్య క్తులు దాడిచేసి బం గారు గొలుసు ఎత్తు కెళ్లిన ఘటన కుందా వారి కండ్రిక ప్రాం తంలో గురువారం రాత్రి చోటు చేసు కుంది.

ఒంటరి వృద్ధురాలి హత్య

5 కాసుల బంగారు గొలుసు చోరీ

పాయకాపురం : ఒంటరి వృద్ధురాలిపై గుర్తు తెలియని వ్య క్తులు దాడిచేసి బం గారు గొలుసు ఎత్తు కెళ్లిన ఘటన కుందా వారి కండ్రిక ప్రాం తంలో గురువారం రాత్రి చోటు చేసు కుంది. ఈ ఘటనలో తీవ్ర గాయాలపాలైన వృ ద్ధురాలు ఆసుపత్రిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మున్నంగి వెంకట సుబ్బమ్మ (70) కుందావారి కండ్రిక గ్రామంలో నివాసం ఉంటోంది. భర్త చనిపోవడం, సంతానం వేరుగా ఉండటంతో ఒంటరిగా జీవిస్తోంది. గురు వారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెపై గుర్తు తెలియని వ్యక్తులు దాడిచేసి తీవ్రంగా గాయ పరిచారు. ఒంటిపై ఉన్న 5కాసుల బంగారు గొలు సు ఎత్తుకెళ్లారు. స్థానికులు, బంధువులు ఆమెను ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందింది. నున్న రూరల్‌ పోలీసులు ఘటనాస్థలాన్ని పరిశీలించి కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Updated Date - 2021-08-27T06:21:27+05:30 IST