వ్యాక్సిన్‌ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించండి

ABN , First Publish Date - 2021-08-20T05:50:47+05:30 IST

కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ సెంటర్‌లో చేపడుతున్న జాగ్రత్తలను పాటించాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు.

వ్యాక్సిన్‌ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించండి
రిజిస్టర్‌ను పరిశీలిస్తున్న నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

వ్యాక్సిన్‌ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించండి

 నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌

విద్యాధరపురం, ఆగస్టు 19 : కరోనా వైరస్‌ వ్యాపిస్తున్న నేపథ్యంలో వ్యాక్సిన్‌ సెంటర్‌లో చేపడుతున్న జాగ్రత్తలను పాటించాలని నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సచివాలయ సిబ్బందికి సూచించారు. గురువారం విద్యాధరపురం  షాదీఖానాను నగర  కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ సిబ్బందితో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్‌ సిబ్బంది తీసుకుంటున్న జాగ్రత్తలను పరిశీలించి, పలు సూచనలు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద శానిటైజర్‌తో పాటు థర్మల్‌ స్కాన్‌ ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో చీఫ్‌ మెడికల్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ జి.గీతాభాయి, హెల్త్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ ఇక్బాల్‌ హుస్సేన్‌ పాల్గొన్నారు.

121, 123, 124 సచివాలయం తనిఖీ

ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాలను నేరుగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత సచివాలయం సిబ్బందిపై ఉందని ప్రసన్న వెంకటేష్‌ పేర్కొన్నారు. గురువారం భవానీపురం లారీ స్టాండ్‌, బబ్బూరి గ్రౌండ్స్‌ ప్రాంగణంలో ఉన్న, 121, 123, 124 సచివాలయాలను కమిషనర్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. సచివాలయం సిబ్బంది హాజరు పట్టిక, మూవ్‌మెంట్‌ రిజిస్టర్‌ను పరిశీలించారు. అధికారులు సమయ పాలన పాటించాలని తెలిపారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగుల హాజరు శాతం, సచివాలయానికి వచ్చే ప్రజల సమస్యలపై వచ్చే దరఖాస్తులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Updated Date - 2021-08-20T05:50:47+05:30 IST