మొదటికొచ్చిన విద్యార్థుల ఆందోళన

ABN , First Publish Date - 2021-11-23T06:35:19+05:30 IST

మొదటికొచ్చిన విద్యార్థుల ఆందోళన

మొదటికొచ్చిన విద్యార్థుల ఆందోళన
ప్రభుత్వ కళాశాలగా గుర్తించాలని కోరుతూ కళాశాల ఆవరణలో ఆందోళన చేస్తున్న విద్యార్థులు

ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ను ప్రభుత్వ కళాశాలగా గుర్తించాలని తరగతుల బహిష్కరణ

ఉయ్యూరు, నవంబరు 22 : ఏజీఅండ్‌ఎస్‌జీఎస్‌ కళాశాలను ప్రభుత్వ కళాశాలగా గుర్తించాలని కోరుతూ కళాశాల విద్యార్థులు సోమవారం తిరిగి ఆందోళన చేపట్టారు. కళాశాలను ప్రభుత్వ కళాశాలగా గుర్తించాలని కోరుతూ నాలుగు రోజుల పాటు ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో తరగతులు బహిష్కరించి ఆందోళన చేశారు. నూజివీడు సబ్‌కలెక్టర్‌ రాజ్యలక్ష్మి ఉయ్యూరు వచ్చి విద్యార్థుల డిమాం డ్లు తెలుసుకుని కళాశాల ప్రిన్సిపాల్‌ సత్యనారాయణ, జూనియర్‌ కళాశాల డైరెక్టర్‌ వినయ్‌కుమార్‌తో శుక్రవారం చర్చలు జరిపారు. ప్రభుత్వ నిర్ణయం మేరకే ఫీజులు వసూలు చేస్తామని, పూర్తి ఎయిడెడ్‌ కళాశాలగా గుర్తిం చాలని ప్రభుత్వానికి రాస్తామని విద్యార్థులు, అధికారుల సమక్షంలో అగీకారం తెలపడంతో ఆరోజు ఆందోళన విరమించారు. కాగా ప్రభుత్వ నిర్ణయం ప్రకటించక పోవడంతో సోమవారం తరగతులు బహిష్కరించి ఆందోళనకు దిగారు. 

పూర్తి గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కళాశాలగా కొనసాగిస్తే అభ్యంతరం లేదు : ప్రిన్సిపాల్‌

కళాశాలను ప్రభుత్వానికి అప్పగించేందుకు సొసైటీ నిబంధనల మేర సాధ్యం కాదని, పూర్తి గ్రాంట్‌ ఇన్‌ ఎయి డ్‌ కళాశాలగా కొనసాగించేందుకు యాజమాన్యానికి ఏవిధమైన అభ్యంతరం లేదని కళాశాల ప్రిన్సిపాల్‌ తెలిపారు. విద్యార్థి సంఘ నాయకులతో ప్రిన్సిపాల్‌, యాజమాన్య ప్రతినిధులు సాయంత్రం చర్చలు జరిపారు. విద్యార్థుల డిమాండ్లు  యాజమాన్యం దృష్టికి తీసుకువెళతామని పదిరోజుల వ్యవధిలో నిర్ణయం తెలియజేస్తామని ప్రతి నిధులు తెలుపగా అంగీకరించిన విద్యార్థులు మంగళవారం నుంచి తరగతులకు హాజరవు తామని ప్రిన్సిపాల్‌కు తెలిపారు. 

Updated Date - 2021-11-23T06:35:19+05:30 IST