దుర్గమ్మ సన్నిధిలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌

ABN , First Publish Date - 2021-10-14T06:30:31+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బుధవారం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం యూనిట్‌ దర్శించుకుంది.

దుర్గమ్మ సన్నిధిలో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌

వన్‌టౌన్‌, అక్టోబరు 13 : ఇంద్రకీలాద్రిపై దుర్గాదేవి అలంకారంలో ఉన్న అమ్మవారిని బుధవారం మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ చిత్రం యూనిట్‌ దర్శించుకుంది. నటుడు అక్కినేని అఖిల్‌, దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్‌, నిర్మాతలు బన్నీ వాసు, వాసువర్మలు అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం అఖిల్‌ మీడియాతో మాట్లాడుతూ, అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. సినిమా సూపర్‌ హిట్‌ అవుతుందని తెలిపారు.. యూనిట్‌ వెంట ఆల్‌ ఇండియా అక్కినేని నాగార్జున యువసేన అధ్యక్షుడు ఎం.సర్వేశ్వరరావు, తదితరులు ఉన్నారు.

Updated Date - 2021-10-14T06:30:31+05:30 IST