వైఎస్సార్‌‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాళులు

ABN , First Publish Date - 2021-07-08T14:34:34+05:30 IST

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.

వైఎస్సార్‌‌కు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ నివాళులు

విజయవాడ: కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు గ్రామంలో దివంగత నేత వైఎస్సార్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పూలమాల వేసి నివాళులర్పించారు.  ఆపై ఎమ్మెల్యే, పలువురు వైసీపీ నేతలు కేక్ కట్ చేశారు. అనంతరం ఎమ్మెల్యే వంశీ గ్రామంలో పశువుల ఆసుపత్రిని ప్రారంభించారు. 

Updated Date - 2021-07-08T14:34:34+05:30 IST