ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ABN , First Publish Date - 2021-03-24T06:19:36+05:30 IST

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం

ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయం
ఎన్నికల ఫలితాలపై సమీక్షస్తున్న గద్దె

 రామలింగేశ్వరనగర్‌, మార్చి 23 : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా తాను, టీడీపీ కార్యర్తలు పనిచేస్తామని ఎమ్మెల్యే  గద్దె రామ్మోహన్‌ అన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు చిత్తశుద్ధితో పనిచేశారన్నారు. మంగళవారం పూర్ణచంద్రనగర్‌లో డివి జన్‌ టీడీపీ నాయకులు, కార్యకర్తలతో ఎన్నికల ఫలితాలపై సమీక్షిం చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తూర్పు నియోజక వర్గంలో టీడీపీ ఓటమి చెందిన డివిజన్‌లలో రోజువారి సమీక్షలు జరిపి  పనిచేసిన నాయకులు, కార్యకర్తలతో విశ్లేషిస్తున్నామని తెలిపారు. పార్టీ ఆవిర్భావం నుంచి ఈ డివిజన్‌లో పార్టీ బలహీనంగా ఉండేదని, గత పదేళ్లలో రత్నం రమేష్‌ ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించి, పార్టీని బలోపేతం చేశామన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీపై ప్రజలకు ఆదరణ ఉన్నా అధికారంలో ఉన్న పార్టీ అభ్యర్థి అయితే బాగుం టుందన్న ఆలోచనతో ఓట్లు వేశారని డివిజన్‌ నాయకులు ఎమ్మెల్యే గద్దె దృష్టికి తీసుకువచ్చారు.  డివిజన్‌ అధ్యక్షుడు రత్నం రమేష్‌ మాట్లాడుతూ 16వ డివిజన్‌లో టీడీపీని ఓడించేందుకు వైసీపీ నాయకులు  ఆర్జీల ద్వారా డ్వాక్రా మహిళలను, వలంటీర్ల  ద్వారా పేదలను మభ్యపెట్టారని అన్నారు. గెలుపు,  ఓటములు సహజమని, ఎప్పటి లాగా రెట్టింపు ఉత్సాహంతో పార్టీ కోసం కృషి చేస్తామని రత్నం రమేష్‌ అన్నారు.

Updated Date - 2021-03-24T06:19:36+05:30 IST