బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు : మంత్రి వెలంపల్లి
ABN , First Publish Date - 2021-12-30T06:38:52+05:30 IST
బీజేపీకి డిపాజిట్లు కూడా దక్కవు : మంత్రి వెలంపల్లి

వన్‌టౌన్, డిసెంబరు 29 : 2024 ఎన్నికల్లో బీజేపీకి కనీసం డిపాజిట్లు దక్కవని, చిత్తుగా ఓడిపోతుందని దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు అన్నారు. బుధవారం నగరంలోని పలు కార్యక్రమాల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బీజేపీ నాయకులు అవాకులు చవాకులు పేలుతున్నారని, అంతర్వేది రథం దగ్ధమైన ఘటనపై సీబీఐ విచారణ కోరితే, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్పందించలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని బ్లాక్‌మెయిల్ చేస్తోందని, దీనికి ఎవరూ భయపడరని మండిపడ్డారు. బీజేపీ దిక్కుమాలిన రాజకీయాలు చేస్తోందని, సీఎం రమేశ్, సుజనాచౌదరిలే ఏపీలో బీజేపీని నడుపుతున్నారన్నారు. రాష్ట్ట్ర ప్రయోజనాల కోసం ఏం చేస్తున్నారో చెప్పకుండా సోము వీర్రాజు మద్యం గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు.