అన్ని ఏర్పాట్లూ చేశాం

ABN , First Publish Date - 2021-10-07T06:32:41+05:30 IST

ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు.

అన్ని ఏర్పాట్లూ చేశాం
శరన్నవరాత్రి ఏర్పాట్లను పరిశీలిస్తున్న మంత్రి వెలంపల్లి, అధికారులు

దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు

పాయకాపురం : ఇంద్రకీలాద్రిపై దసరా ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా అన్ని ఏర్పాట్లు చేశామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తెలిపారు. ఉత్సవాల్లో భాగంగా దేవస్థానం చేసిన ఏర్పాట్లను బుధవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ అన్ని శాఖల సమన్వయంతో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లను చేసినట్టు చెప్పారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ త్వరితగతిన భక్తులకు అమ్మవారి దర్శనం జరిగేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. భక్తులకు అవసరమైన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేశామన్నారు. పర్యటనలో మంత్రి వెంట ఎమ్మెల్యే మల్లాది విష్ణు, కలెక్టర్‌ నివాస్‌, జేసీ మాధవీలత, నగర కమిషనర్‌ ప్రసన్న వెంకటేష్‌ తదితరులున్నారు. 

Updated Date - 2021-10-07T06:32:41+05:30 IST