తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు : మంత్రి పేర్ని నాని
ABN , First Publish Date - 2021-10-29T06:37:08+05:30 IST
తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్ని నాని అన్నారు.
మచిలీపట్నం టౌన్ : తాగునీటి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టామని మంత్రి పేర్ని నాని అన్నారు. శారదానగర్ ప్రాంతంలో రూ. కోటి 50 లక్షల వ్యయంతో నిర్మించే పైపులైను పనులకు మంత్రి పేర్ని నాని గురువారం శంకుస్థాపన చేశారు. హెడ్ వాటర్ వర్క్స్ నుంచి శారదానగర్ ఓవర్ హెడ్‌ట్యాంక్ వరకు పైపులైను నిర్మిస్తున్నామన్నారు. మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్లు లంకా సూరిబాబు, తంటిపూడి కవిత, మార్కెట్ యార్డు చైర్మన్ అచ్చాబా, నాయకులు చిటికెన నాగేశ్వరరావు, మహమ్మద్ రఫీ, షేక్ సాహెబ్, నాలి శారద, థామస్ నోబుల్, నాలి మాధవ, కమిషనర్ శివరామకృష్ణ, ఎంఈ త్రినాథ్, ఏఈ వరప్రసాద్, పిల్లి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.