సెప్టెంబర్‌కు మొదటి దశ ఇళ్లు పూర్తికావాలి

ABN , First Publish Date - 2021-08-27T06:22:08+05:30 IST

‘‘మొదటి దశ కింద గ్రౌం డింగ్‌ అయిన ఇళ్లన్నీ సెప్టెంబరు చివరికి పూర్తికావాలి.

సెప్టెంబర్‌కు మొదటి దశ ఇళ్లు పూర్తికావాలి

హౌసింగ్‌ సమీక్షలో మంత్రి శ్రీరంగనాథరాజు

అమరావతి, ఆగస్టు 26 (ఆంధ్రజ్యోతి): ‘‘మొదటి దశ కింద గ్రౌం డింగ్‌ అయిన ఇళ్లన్నీ సెప్టెంబరు చివరికి పూర్తికావాలి. జిలాస్థాయి అధికారులు తరచూ జగనన్న కాలనీల్లో పర్యటించాలి. లబ్ధిదారులు త్వరగా ఇళ్లు పూర్తిచేసుకునేలా సన్నద్ధం చేయాలి’’ అని గృహ నిర్మాణ శాఖ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు ఆదేశించారు. పక్కా ఇళ్ల నిర్మాణాలపై గురువారం నగరంలోని హౌసింగ్‌ కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. చీఫ్‌ సెక్రటరీ ఆదిత్యనాథ్‌దా్‌స సహా అన్ని జిల్లాల హౌసింగ్‌ జేసీలు పాల్గొన్నారు. సమీక్షలో హౌసింగ్‌ స్పెషల్‌ సీఎస్‌ అజయ్‌ జైన్‌, హౌసింగ్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దావులూరి దొరబాబు, ఎండీ భరత్‌ గుప్తా, హౌసింగ్‌ ప్రత్యేక కార్యదర్శి రాహుల్‌ పాండే పాల్గొన్నారు.

Updated Date - 2021-08-27T06:22:08+05:30 IST