మరియ తనయా.. మధుర హృదయా!

ABN , First Publish Date - 2021-12-25T07:10:50+05:30 IST

ఇది మహోదయం.. క్రీస్తు జన్మదినం.. అంటూ ఆనందగీతాలు ఆలపిస్తూ.. బాలయేసు ఎదుట భక్తులు ప్రణమిల్లారు.

మరియ తనయా.. మధుర హృదయా!
బాలయేసుకు దివ్యపూజాబలి సమర్పిస్తున్న బిషప్‌ తెలగతోటి రాజారావు

ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు


ఇది మహోదయం.. క్రీస్తు జన్మదినం.. అంటూ ఆనందగీతాలు ఆలపిస్తూ.. బాలయేసు ఎదుట భక్తులు ప్రణమిల్లారు. క్రిస్మస్‌ వేడుకలతో శుక్రవారం అర్ధరాత్రి విజయవాడ నగరం సందడిగా మారింది. భారీ సంఖ్యలో చర్చిలకు చేరుకున్న భక్తులు ఏసునామాన్ని స్తుతించారు. చర్చి ప్రాంగణాల్లో బాలయేసు ప్రతిమలను, వివిధ రకాల క్రిస్మస్‌ ట్రీలను ఏర్పాటు చేశారు. మరియమాత ఒడిలో ఉన్న ఏసుక్రీస్తు రూపానికి పూజలు చేశారు. గుణదల చర్చి, బెంజ్‌సర్కిల్‌ సమీపంలోని సెయింట్‌పాల్‌ కతెడ్రల్‌, వన్‌టౌన్‌లోని ఆర్‌సీఎం, సీఎస్‌ఐ చర్చిలు, తెలుగు బాప్టిస్ట్‌ చర్చిల్లో క్రిస్మస్‌ వేడుకలు ఘనంగా జరిగాయి. ప్రార్థనల అనంతరం ఫాదర్లు దివ్యపూజా బలిహరణలో పాల్గొని ఏసుక్రీస్తు పుట్టుక, మహిమల గురించి వివరించారు.  -విజయవాడ

Updated Date - 2021-12-25T07:10:50+05:30 IST