మండవల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రూ.2.53 కోట్ల మేర నకిలీ చలానాలు

ABN , First Publish Date - 2021-08-20T06:04:17+05:30 IST

మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రూ.2.53 కోట్లు విలువైన నకిలీ చలానాలు వినియోగించినట్లు విచారణలో రుజువైందని జిల్లా రిజిస్ర్టార్‌ ఉపేంద్ర, జిల్లా ఆడిట్‌ అధికారి రామారావు వెల్లడించారు.

మండవల్లి సబ్‌రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రూ.2.53 కోట్ల మేర నకిలీ చలానాలు

మండవల్లి  : మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో రూ.2.53 కోట్లు విలువైన నకిలీ చలానాలు వినియోగించినట్లు విచారణలో రుజువైందని జిల్లా రిజిస్ర్టార్‌ ఉపేంద్ర, జిల్లా ఆడిట్‌ అధికారి రామారావు వెల్లడించారు. మండవల్లి సబ్‌ రిజిస్ర్టార్‌ కార్యాలయంలో గురువారం వారు విలేకర్లతో మాట్లాడారు. నకిలీ చలానాల వ్యవహారంలో పక్క దారి పట్టిన సొమ్మును రికవరీ చేసేందుకు సంబంధిత రైతాంగానికి నోటీసులు జారీ చేశామన్నారు. 567 మంది రైతులకు నోటీసులు ఇచ్చేందుకు సిద్ధం చేశామన్నారు. ఈ వ్యవహారంలో పాత్రధారులు ఎవరో  రైతుల విచారణలో వెల్లడవుతుందన్నారు. దీనికి సంబంధించిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్నారు. నకిలీ చలానాల వ్యవహా రాంలో 16 రిజిస్ర్టేషన్లకు సంబంధించి రూ.17లక్షలను రైతులు రికవరీగా చెల్లించారన్నారు.  మిగతా సొమ్ము రికవరీకి కట్టుదిట్టమైన చర్యలు చేపడతామన్నారు.   

Updated Date - 2021-08-20T06:04:17+05:30 IST