వైభవంగా ప్రారంభమైన మనగుడి మహోత్సవాలు

ABN , First Publish Date - 2021-10-14T06:20:27+05:30 IST

తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, జిల్లా ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ శ్రీకన్యకాపరమేశ్వరి శ్రీ నగరేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం మనగుడి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.

వైభవంగా ప్రారంభమైన   మనగుడి మహోత్సవాలు

వైభవంగా ప్రారంభమైన మనగుడి మహోత్సవాలు

విజయవాడ కల్చరల్‌, అక్టోబరు 13 : తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మ ప్రచార పరిషత్‌, జిల్లా ఆధ్వర్యంలో స్థానిక శ్రీరామ శ్రీకన్యకాపరమేశ్వరి శ్రీ నగరేశ్వరస్వామి దేవస్థానంలో బుధవారం మనగుడి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ధర్మప్రచార మండలి సభ్యుడు బొగ్గవరపు బాల కోటేశ్వరరావు, లయన్స్‌ క్లబ్‌ డిస్ట్రిక్ట్‌ గవర్నర్‌ శాంతి జ్యోతి వెలిగించారు. తదుపరి శ్రీ లలితాంబికా పారాయణ బృం దం లలితా సహస్రనామ స్తోత్ర పారాయణ చేశారు. ఎస్‌కేపీవీవీ హిందూ హైస్కూల్‌ విద్యార్థులు అక్షయ, గురు మీనాక్షి నృత్య ప్రదర్శనతో అలరించారు. మహాలక్ష్మి బృందం లింగాష్టక పారాయణ, భక్తి గీతాలాపన చేశా రు. భజన, కోలాటం కార్యక్రమాలతో కనువిందు చేశారు. జనరల్‌ సెక్రటరీ శివకుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-10-14T06:20:27+05:30 IST