మల్లెల పుష్పాంజనీదేవికి ఘన నివాళి
ABN , First Publish Date - 2021-12-31T05:17:05+05:30 IST
మల్లెల పుష్పాంజనీదేవికి ఘన నివాళి

ఫెర్రీ(ఇబ్రహీంపట్నం), డిసెంబరు 30 : మాజీ సర్పంచ్, దివంగత మల్లెల అనంత పద్మనాభరావు సతీమణి పుష్పాంజనీదేవికి టీడీపీ నేతలు ఘన నివాళులర్పించారు. ఫెర్రీలోని ఆమె నివాసంలో పుష్పాంజనీదేవి పెద్దకర్మ గురువారం జరిగింది. మల్లెల అనంత పద్మనాభరావు, పుష్పాంజనీదేవి చిత్రపటాలకు టీడీపీ నేతలు పూలమాలలు వేసి నివాళులర్పించారు. వారి కుమారుడు మల్లెల శ్రీనివాసచౌదరిని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు రామినేని రాజశేఖర్, కొండపల్లి మున్సిపాలిటీ వార్డు కౌన్సిలర్లు చెన్నుబోయిన చిట్టిబాబు, చనమోలు నారాయణరావు, మైలా మహాలక్ష్మి, ధరణికోట విజయలక్ష్మి, టీఎన్‌వీకేఎస్ నాయకులు కోగంటి వెంకటేశ్వరరావు, మాజీ ఎంపీపీ తాడికొండ సత్యనారాయణ , బీసీ సెల్ నాయకులు పీతా శ్రీనివాసరాజు, టీఎన్‌టీయూసీ నాయకులు సుంకర విష్ణుకుమార్, మండల ఉపాధ్యక్షుడు వెలగపూడి రామకృష్ణ, ఎస్సీ సెల్ నాయకులు కూచిపూడి దిలీప్ కుమార్, బొక్కినాల బెనర్జీ, జూపూడి నాయకులు గౌర్నేని పిచ్చేశ్వరరావు, ములుగు సురేష్ తదితరులు పాల్గొన్నారు.