వరిగడ్డి ట్రాక్టర్‌లో మద్యం రవాణా

ABN , First Publish Date - 2021-12-19T06:25:53+05:30 IST

చిల్లకల్లు వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 345 మద్యం సీసాలతో పాటు ముగ్గురిని అదుపులోకి తీసుకుని ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు చిల్లకల్లు ఎస్సై రమేష్‌ తెలిపారు.

వరిగడ్డి ట్రాక్టర్‌లో మద్యం రవాణా
స్వాధీనం చేసుకున్న మద్యంతో పోలీసులు

జగ్గయ్యపేట రూరల్‌ : చిల్లకల్లు వద్ద తెలంగాణ నుంచి అక్రమంగా తరలిస్తున్న 345 మద్యం సీసాలతో పాటు ముగ్గురిని  అదుపులోకి తీసుకుని ట్రాక్టర్‌ను సీజ్‌ చేసినట్లు చిల్లకల్లు ఎస్సై రమేష్‌ తెలిపారు. తెలంగాణ కొత్తగూడెం నుంచి వేదాద్రికి చెందిన తూమాటి బాజీబాబుకు చెందిన ట్రాక్టర్‌లో వరిగడ్డి తరలిస్తున్నారు. గడ్డితో పాటు మద్యం తీసుకెళ్తున్నారనే సమాచారంతో సోదా చేయగా మద్యం సీసాలు దొరికినట్లు తెలిపారు. డ్రైవర్‌ తిరుమలగిరి గోపిని అదుపులోకి తీసుకుని విచారించగా వేదాద్రికి చెందిన మాజీ సర్పంచ్‌ శేవానాయక్‌ తన గడ్డి వాహనంలో మద్యం తెచ్చిపెట్టినట్లు తెలపటంతో కేసు నమోదు చేశామన్నారు. ట్రాక్టర్‌ యజమాని బాజీబాబుపై కూడా కేసు నమోదు చేశామన్నారు. బాజిబాబు తండ్రి జగ్గయ్యపేట పట్టణంలోని కృష్ణా ఫార్మర్స్‌ సొసైటీ అధ్యక్షుడిగా పని చేస్తున్నారు. 


Updated Date - 2021-12-19T06:25:53+05:30 IST