తెలంగాణ మద్యం స్వాధీనం

ABN , First Publish Date - 2021-02-08T06:25:55+05:30 IST

తెలంగాణ మద్యం స్వాధీనం

తెలంగాణ  మద్యం స్వాధీనం

జగ్గయ్యపేటరూరల్‌, ఫిబ్రవరి 7: మండలంలోని గండ్రాయి, జగ్గయ్యపేట ప్రాంతాల్లో నిర్వహించిన దాడుల్లో తెలంగాణ  నుంచి తరలిస్తున్న 126 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నట్టు ఎక్సైజ్‌ సీఐ గురవయ్య తెలిపారు. మద్యం తరలిస్తున్న ఒక మహిళతో పాటు ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.   వత్సవాయి మండలం దేచుపాలెం గ్రా మానికి చెందిన దశరధ్‌ వద్ద 114 సీసా లు, బైక్‌, జగ్గయ్యపేటకు చెందిన కోటేశ్వరమ్మ వద్ద 12మద్యం సీసాలనును స్వాఽ దీనం చేసుకున్నట్టు ఆయన వివరించారు. ఎక్సైజ్‌ ఎస్సై ఆలీ, సిబ్బంది పాల్గొన్నారు.

ఫ నందిగామ రూరల్‌ : మం డలంలోని జొన్నలగడ్డ సరిహద్దు చెక్‌పోస్టు వద్ద పోలీసులు ఆదివారం వాహనాల తనిఖీ నిర్వహించారు. తెలంగాణా రాష్ట్రం మధిర వైపు నుంచి ఆటోలో వస్తున్న మహిళ వద్ద నుంచి 48 మద్యం సీసాలను పోలీసులు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  మరో వ్యక్తి నుంచి మూడు మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. 

ఫ వీరులపాడు : మద్యం అక్రమ రవాణాకు పాల్పడితే సహించేది లేదని డీఎస్పీ నాగేశ్వరరెడ్డి పేర్కొ న్నారు. మండలంలోని పెద్దాపురం సరిహద్దు చెక్‌పోస్టు వద్ద ఆదివారం పోలీసులు వాహనాల తనిఖీ నిర్వ   హించి తెలంగాణా వైపు నుంచి ఆటోలో తీసుకువస్తున్న 280 మద్యం సీసాలు స్వాధీనం చేసుకుని వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఆటో సీజ్‌ చేసి వ్యక్తిపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో నందిగామ రూరల్‌ సీఐ సతీష్‌, ఎస్సై మణి కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు. 

Updated Date - 2021-02-08T06:25:55+05:30 IST