లయన్‌ శంకర్‌గుప్తాకు సత్కారం

ABN , First Publish Date - 2021-05-24T06:05:34+05:30 IST

విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న జె.ఎన్‌.శంకర్‌గుప్తా లయన్స్‌ జిల్లా వైస్‌ గవర్నర్‌గా ఎన్నికవ్వడం శుభపరిణామని లయ న్స్‌ సుప్రీం క్యాబినెట్‌ సెక్రటరి పెనుమత్స అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు.

లయన్‌ శంకర్‌గుప్తాకు  సత్కారం

అజిత్‌సింగ్‌నగర్‌, మే 23 : విద్య, వైద్య రంగాల అభ్యున్నతికి విశేష కృషి చేస్తున్న జె.ఎన్‌.శంకర్‌గుప్తా లయన్స్‌ జిల్లా వైస్‌ గవర్నర్‌గా ఎన్నికవ్వడం శుభపరిణామని లయ న్స్‌ సుప్రీం క్యాబినెట్‌ సెక్రటరి పెనుమత్స అప్పలరాజు హర్షం వ్యక్తం చేశారు. లయ న్స్‌ క్లబ్‌ జిల్లా గవర్నర్‌గా దేవినేని జోనికుమారి, వైస్‌ గవర్నర్లుగా దామర్ల శ్రీశాంతి, జె.ఎన్‌. శంకర్‌గుప్తా ఎన్నికయిన సందర్భంగా  అజిత్‌సింగ్‌నగర్‌ వివేకానంద సెంటినరీ పాఠశాలలోఆదివారం అభినందన సభ నిర్వహించారు. పేద విద్యార్థుల చదువుకు, ఆరోగ్య పరిరక్షణకు తన వంతు సహకారం అందిస్తున్న శంకర్‌ గుప్తాను ఘనంగా సత్కరించారు. అప్పలరాజు మాట్లాడుతూ శంకర్‌ గుప్తా సేవలు మరింత విస్తరిస్తాయని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ప్రధానోపాధ్యాయులు రమణారావు, ఇంగ్లీష్‌ మీడియం స్కూల్‌ హెచ్‌ఎం మాధవీలత, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-05-24T06:05:34+05:30 IST