పేదల పక్కా గృహాలకు ఉచిత రిజిస్ట్రేషన్ చేయాలి
ABN , First Publish Date - 2021-12-15T06:38:52+05:30 IST
ప్రభుత్వం పేదలకిచ్చిన పక్కా గృహాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
గవర్నర్‌పేట, డిసెంబరు 14 : ప్రభుత్వం పేదలకిచ్చిన పక్కా గృహాలకు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొన్న వివిధ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీఎస్) సంయుక్త ఆధ్వర్యం లో మంగళవారం ఎంజీ రోడ్డులోని ఎంబీ విజ్ఞాన కేంద్రం బాలోత్సవ భవన్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. కేవీపీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ.మాల్యాద్రి అధ్యక్షత వహించారు. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ సబ్సిడీతో పేదలకు కట్టించిన పక్కా గృహాలకు అప్పు రద్దు పేరుతో వన్‌టైం సెటిల్‌మెంట్ పథకం ప్రవేశపెట్టడం దుర్మార్గమన్నారు. కేపీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి. నటరాజు పేదల గృహాలకు ఉచిత రిజిస్ట్రేషన్లు చేయాలని డిమాండ్ చేస్తూ తీర్మానం ప్రవేశపెట్టగా ఏకగ్రీవంగా ఆమోదం పొందింది. ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దడాల సుబ్బారావు, ఎంఆర్‌పీఎస్ అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర కోశాధికారి కె. అధికారి, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి. అజయ్‌కుమార్, ముఠావర్కర్స్ రాష్ట్ర ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి కె. ఉమామహేశ్వరరావు, డప్పు కళాకారుల సంఘం రాష్ట్ర కార్యదర్శి జి. క్రాంతికుమార్ పాల్గొన్నారు.