ఆక్సిజన్‌ కొరత నివారణకు చర్యలు

ABN , First Publish Date - 2021-05-02T06:17:02+05:30 IST

ఆక్సిజన్‌ కొరత నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రత్యేకాధిరి కృష్ణబాబు తెలిపారు.

ఆక్సిజన్‌ కొరత నివారణకు చర్యలు

గన్నవరం, మే1 : ఆక్సిజన్‌ కొరత నివారించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుందని కొవిడ్‌ కేర్‌ సెంటర్‌ ప్రత్యేకాధిరి కృష్ణబాబు తెలిపారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి కృషితో కార్గో విమానాల ద్వారా ఆక్సిజన్‌ ఇతర ప్రాంతాల నుంచి రాష్ర్టానికి తీసుకువస్తున్నట్లు చెప్పారు. రాష్ర్టానికి ఆక్సిజన్‌ తీసుకొచ్చేందుకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రెండు వాహనాలు కార్గో విమానంలో శనివారం ఒరిస్సా వెళ్లాయి. ఎయిర్‌పోర్టుకు వచ్చిన కొవిడ్‌ కేర్‌ సెంటర్స్‌ ప్రత్యేకాధికారి  కృష్ణబాబు మీడియాతో మాట్లాడారు. కొవిడ్‌తో బాధపడుతూ 90శాతంలోపు ఆక్సిజన్‌ తగ్గిన వారందరికీ ఆక్సిజన్‌ అందించాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే  రాష్ట్రంలో ప్రతిరోజు  20వేల మంందికి ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రులలో  ఆక్సిజన్‌ అందిస్తున్నామని తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం ఆక్సిజన్‌ సరఫరా నియంత్రణ, పర్యవేక్షణ కోసం ప్రత్యేక సెల్‌ను రాష్ట్రస్థాయిలో ఏర్పాటు చేసిందన్నారు. రాష్ర్టానికి 470 మెట్రిక్‌ టన్నుల ఆక్సిజన్‌ కేంద్రం కేటాయించిందని చెప్పారు. వైజాగ్‌ స్టీల్‌ ప్లాంట్‌, ఇతరచోట్ల 250 మెట్రిక్‌ టన్నులు ఆక్సిజన్‌ వస్తోందని, మిగతా 220 మెట్రిక్‌ టన్నులు ఇతర దూర ప్రాంతాల నుంచి వస్తోందని చెప్పారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి చొరవ తీసుకుని ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్‌తో మాట్లాడి కార్గో విమానాల్లో ఆక్సిజన్‌ తీసుకువచ్చేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. మొదటిసారి కార్గో విమానం ద్వారా ఖాళీ వాహనాలను పంపించామన్నారు. ఇందుకోసం ప్రత్యేక రవాణా వ్యవస్థ పర్యవేక్షణను చేపడుతున్నట్లు ఆయన వివరించారు. నింపిన ఆక్సిజన్‌ వాహనాలు రాష్ర్టానికి రావడానికి రెండు రోజులు సమయం పడుతోందన్నారు. ఆక్సిజన్‌ సమర్ధవంతంగా వినియోగించుకునేందుకు వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ పోలీస్‌ తదితర శాఖలతో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తున్నామన్నారు.  ఆక్సిజన్‌ను గ్రీన్‌చానల్‌ ద్వారా ఆయా ఆస్పత్రులకు తరలించే ఏర్పాట్లు చేశామన్నారు. షన్‌ మోహన్‌, ఎయిర్‌పోర్టు డైరెక్టర్‌ జి.మధుసూదనరావు, అంకిత్‌ జైస్వాల్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-05-02T06:17:02+05:30 IST