కృష్ణానదీ ఘాట్‌లు కిటకిట
ABN , First Publish Date - 2021-05-24T06:03:50+05:30 IST
వన్‌టౌన్‌లోని దుర్గాఘాట్ పిండప్రదా నం ఘాట్, వీఐసీ ఘాట్, భవానీపురంలోని పున్న మిఘాట్, భవానీ ఘాట్‌లు ఆదివారం కిటకిట లాడాయి.
పెద్ద సంఖ్యలో కర్మకాండలు
వన్‌టౌన్, మే 23 : వన్‌టౌన్‌లోని దుర్గాఘాట్ పిండప్రదా నం ఘాట్, వీఐసీ ఘాట్, భవానీపురంలోని పున్న మిఘాట్, భవానీ ఘాట్‌లు ఆదివారం కిటకిట లాడాయి. కరోనా బారిన పడి చనిపోయిన వారికి, అనారోగ్యానికి గురై చనిపోయిన వారికి కుటుంబ సభ్యులు వన్‌టౌన్‌లోని దుర్గాఘాట్, భవానీపురం లోని పున్నమిఘాట్, భవానీ ఘాట్‌లలో పిండప్రదానం, అస్తికల నిమజ్జనం, కర్మకాండలు నిర్వహించటానికి ఆదివారం తెల్లవారు జామున 3 గంటల నుంచి పలు ప్రాంతాల నుంచి మృతుల కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. ఆయా ఘాట్‌లు కిటకిటలాడాయి. మృతుల కుటుంబ సభ్యులు తరలి రావడంతో ఘాట్‌ల వద్ద ఉన్న తీర్థ పురోహితులు ఘాట్‌లలో ఖాళీ ప్రదేశం లేనందున, బయట రోడ్డుపైనే ఆయా కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం 12 గంటల వరకు ఘాట్‌లకు పెద్ద ఎత్తున రాకపోకలు సాగించారు. ఘాట్‌లకు వచ్చిన వారు మాస్క్ ధరించినప్పటికి భౌతిక దూరం పాటించకపోవడంతో పలువురు ఇబ్బందులకు గురయ్యాయి. తీర్థ పురోహితులు కూడా తమ వద్దకు వచ్చిన వారికి కావలసిన కార్యక్ర మాలు చేసి పంపించే పనిలో నిమగ్నమయ్యారు. ఆయా ఘాట్‌లకు వచ్చిన మృతుల కుటుంబ సభ్యుల వద్ద తీర్థ పురోహితులు అధిక దక్షిణ వసూలు చేశారు. మాములు రోజుల్లో పిండప్రదానానికి రూ. 300లు, అస్తికలు నిమజ్జనానికి రూ. 1000, కర్మకాండలకు రూ.8000 పురోహి తులు దక్షిణగా వసూలు చేస్తుంటారు. ఆయా కార్యక్రమాలు నిర్వహించటానికి వచ్చే జనం అధికంగా ఉండటంతో మృతుల కుటుంబ సభ్యుల నుంచి ఎక్కువ దక్షిణ వసూలు చేశారు.