AP: నందిగామలో అక్రమ కట్టడాల కూల్చివేత

ABN , First Publish Date - 2021-12-25T17:52:06+05:30 IST

కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు.

AP: నందిగామలో అక్రమ కట్టడాల కూల్చివేత

విజయవాడ: కృష్ణా జిల్లా నందిగామలో అక్రమ కట్టడాలను అధికారులు కూల్చివేస్తున్నారు. నందిగామ సీఎం రోడ్‌లో అక్రమంగా నిర్మించిన అపార్ట్‌మెంట్ల కూల్చివేతకు చర్యలు చేపట్టారు. సీఎం రోడ్‌లో డ్రైనేజ్ వ్యవస్థ నిర్మాణం కోసం ఇరువైపుల ఉన్న వాటిని ధ్వంసం చేస్తున్నారు. మున్సిపల్ అధికారులు, పోలీసులు సమక్షంలో కూల్చివేతలు జరుగుతున్నాయి. కూల్చివేతలను అడ్డుకుంటున్న స్థానికులు అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. 

Updated Date - 2021-12-25T17:52:06+05:30 IST