భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులు

ABN , First Publish Date - 2021-01-13T12:50:46+05:30 IST

ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు.

భోగి మంటల్లో వ్యవసాయ చట్టాల ప్రతులు

కృష్ణా: ఢిల్లీలో రైతుల దీక్షలకు మద్దతుగా రాష్ట్ర సాగునీటి వినియోగదారుల సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. కేంద్రం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాల ప్రతులను భోగి మంటల్లో వేసి ఆందోళన‌కు దిగారు. బాపులపాడు మండల కేంద్రంలో సమాఖ్య అధ్యక్షుడు ఆళ్ల గోపాలకృష్ణ ఆధ్వర్యంలో రైతులు నిరసన దీక్ష చేపట్టారు. నల్ల చట్టాలను రద్దు చేయాలని.. కేంద్రం మొండి వైఖరి నసించాలని కోరుతూ రైతు సంఘ నేతల నినాదాలు చేశారు. 

Updated Date - 2021-01-13T12:50:46+05:30 IST