లెక్క తేలింది..!

ABN , First Publish Date - 2021-11-09T05:36:20+05:30 IST

లెక్క తేలింది..!

లెక్క తేలింది..!

కొండపల్లి బరిలో 113 మంది, జగ్గయ్యపేట బరిలో 95 మంది

ఇబ్రహీంపట్నం/జగ్గయ్యపేట, నవంబరు 8 : కొండపల్లి మున్సిపల్‌ ఎన్నికల బరిలో 113 మంది అభ్యర్థులు బరిలో ఉన్నట్లు ఎన్నికల అధికారి శ్రీధర్‌ ప్రకటించారు. 29  డివిజన్లకు గానూ 222 మంది అభ్యర్థులు నామినేషన్లు వేయగా, వారిలో 89 మంది సోమవారం నామినేషన్లు ఉపసంహరించుకున్నారని తెలిపారు. టీడీపీ 29, వైసీపీ 29, బీజేపీ 15, జనసేన 12, సీపీఐ 1, సీపీఎం 3, స్వతంత్రులు 17, కాంగ్రెస్‌ 7 నామినేషన్లు దాఖలయ్యాయని చెప్పారు. అత్యధికంగా ఒకటో వార్డులో ఏడుగురు బరిలో ఉన్నారని, అత్యల్పంగా 22, 24 వార్డుల్లో ఇద్దరు చొప్పున పోటీలో ఉన్నారని పేర్కొన్నారు. ఇక జగ్గయ్యపేట పురపాలక సంఘ ఎన్నికల్లో 95 మంది పోటీలో నిలిచినట్టు సహాయ ఎన్నికల అధికారి, కమిషనర్‌ సుభాష్‌ చంద్రబోస్‌ తెలిపారు. 31 వార్డులకు టీడీపీ తరఫున 31 మంది, వైసీపీ తరఫున 31 మంది, బీజేపీ తరఫున 9 మంది, జనసేన తరఫున ముగ్గురు, ఇండిపెండెంట్లు 21 మంది పోటీలో నిలిచినట్టు చెప్పారు. ఇండిపెండెంట్లకు ఎన్నికల గుర్తులు కేటాయించామని ఆయన పేర్కొన్నారు. 

Updated Date - 2021-11-09T05:36:20+05:30 IST