ఎన్నికల వాయిదాకు వైసీపీ పాచికలు పారలేదు
ABN , First Publish Date - 2021-02-01T06:35:21+05:30 IST
ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓడిపోతారనే భయం అడుగడుగునా సీఎం జగన్‌మోహనరెడ్డికి ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు.

మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, మాజీ ఎంపీ కొనకళ్ల
మచిలీపట్నం టౌన్, జనవరి 31 : స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేసేందుకు వైసీపీ ప్రభుత్వం వేసిన పాచికలు చెల్లలేదని, ఎన్నికల్లో వైసీపీ నాయకులు ఓడిపోతారనే భయం అడుగడుగునా సీఎం జగన్‌మోహనరెడ్డికి ఉందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు కొల్లు రవీంద్ర విమర్శించారు. మచిలీపట్నం బస్టాండ్ సెంటర్‌లోని టీడీపీ మచిలీపట్నం పార్లమెంటు కార్యాలయంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో కొల్లు రవీంద్ర మాట్లాడారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయఢంకా మోగిస్తుందన్నారు. మాజీ ఎంపీ, మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ అధ్యక్షుడు కొనకళ్ల నారాయణరావు మాట్లాడుతూ వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత పోర్టు నిర్మాణ పనులు ఆగిపోయాయన్నారు. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గ తెలుగునాడు స్టూడెంట్స్ ఫెడరేషన్ అధ్యక్షుడు నిమ్మగడ్డ సత్యసాయి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ రైతు అధ్యక్షుడు గోపు సత్యనారాయణ, టీడీపీ పట్టణ అధ్యక్షుడు ఇలియాస్ పాషా, ప్రధాన కార్యదర్శి పిప్పళ్ల కాంతారావు పాల్గొన్నారు.