కోగంటికి కస్టడీ

ABN , First Publish Date - 2021-09-02T06:11:53+05:30 IST

కోగంటికి కస్టడీ

కోగంటికి కస్టడీ

రెండు రోజులు పోలీసుల విచారణ

విజయవాడ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి) : యువ పారిశ్రామికవేత్త కరణం రాహుల్‌ హత్య కేసులో రెండో నిందితుడిగా ఉన్న కోగంటి సత్యనారాయణ అలియాస్‌ సత్యంను రెండు రోజులు పోలీసు కస్టడీకి ఇస్తూ న్యాయస్థానం బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ కేసులో పోలీసులు ఇప్పటివరకు 11 మందిని అరెస్టు చేశారు. రాహుల్‌ హత్యకు సూత్రధారి కోగంటి సత్యం అని పోలీసులు నిర్ధారించారు. తొలుత అరెస్టు చేసినా కోగంటి సత్యం నుంచి మరిన్ని వివరాలు సేకరించాలని పోలీసులు భావిస్తున్నారు. ఆయనను పది రోజులు కస్టడీకి ఇవ్వాలని పిటిషన్‌లో కోరారు. రెండు రోజుల క్రితం దీనిపై వాదనలు ముగియగా, కస్టడీకి న్యాయస్థానం అనుమతించింది. రిమాండ్‌ నిమిత్తం కోగంటిని మచిలీపట్నంలోని సబ్‌జైలుకు తరలించారు. అక్కడ కరోనా నెగిటివ్‌ రావడంతో విజయవాడలోని జిల్లాజైలుకు పంపారు. పోలీసులు గురువారం కస్టడీలోకి తీసుకుంటారు.

Updated Date - 2021-09-02T06:11:53+05:30 IST