పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపునకు అంగీకారం

ABN , First Publish Date - 2021-12-19T05:53:15+05:30 IST

పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపునకు అంగీకారం

పారిశుధ్య కార్మికుల వేతనాలు పెంపునకు అంగీకారం
కార్యదర్శితో చర్చిస్తున్న సీఐటీయూ నాయకులు

హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 18 : మండల కేంద్రమైన బాపులపాడు  పంచాయతీలో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికుల వేతనా లను పెంచడానికి   పంచా యతీ పాలకవర్గం అంగీ కరించింది. శనివారం బాపులపాడు మండల సీఐటీయూ నాయకులు బేత శ్రీనివాసరావు, నల్లి ఆంజనేయులు,  పంచా యతీ కార్మికుల సంఘం జిల్లా నాయకులు మర్రా పు పోలినాయుడు   పం చాయతీ కార్యదర్శి ప్రసా ద్‌ను కలిసి కార్మికుల వేతనాల సమస్యను పరి ష్కరించాలని కోరారు. 2019 నుంచి కార్మికుల వేతన సమస్య పెండింగ్‌లో ఉందని వెంటనే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రూ.12 వేలు వేతనాలతో కార్మికులు పనిచేస్తు న్నారని పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరలను బట్టి కార్మికుల వేతనాలు రూ.18వేలు పెంచాలని  డిమాండ్‌ చేశారు. సర్పంచ్‌ సరి పల్లి కమలాభాయి, కార్యదర్శి ప్రసాద్‌ కార్మిక సంఘం నాయకులతో చర్చలు జరిపారు.  పంచాయతీ  ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుంటే రూ.18వేలు వేతనం ఇవ్వడం సాధ్యంకాదని, మథ్యే మార్గంగా  రూ.1000లు పెంచడానికి పంచాయతీ అంగీ కరించింది. రూ.12వేలు వేతనాన్ని రూ.13వేలు  చేస్తున్నట్లు కార్యదర్శి ప్రసాద్‌ ప్రకటించారు.  గత ఏప్రిల్‌ నెల నుంచి రూ.13వేలు పెంపు అమలు చేయనున్నట్లు ప్రకటించారు. పెరిగిన వేతన బకాయిలు త్వరతిగతిన చెల్లించను న్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా కార్మికులు, సంఘం నాయకులు పంచాయతీ పాలక వర్గానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నేత కొమరవల్లి కిరణ్‌మూర్తి తదితరులు ఉన్నారు.  

Updated Date - 2021-12-19T05:53:15+05:30 IST