కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

ABN , First Publish Date - 2021-05-05T05:45:22+05:30 IST

కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ

కర్ఫ్యూ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు: డీఎస్పీ
మాట్లాడుతున్న డీఎస్పీ బి.శ్రీనివాసులు

నూజివీడు రూరల్‌, మే 4: నూజివీడు సబ్‌ డివిజన్‌ పరిధిలో కొవిడ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా బుధవారం నుంచి మధ్యాహ్నం 12 గంటల తరువాత కర్ఫ్యూ విఽధిస్తామని నూజివీడు డీఎస్పీ బి.శ్రీనివాసులు అన్నారు. మంగళవారం రాత్రి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సబ్‌డివిజన్‌ పరిధిలోని ప్రజలు, అధికారులు, ఉద్యోగులు కర్ఫ్యూ నిబంధనలు పాటించాలన్నారు. ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పసులు ముగించుకుని సురక్షితంగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. కరోనా నియంత్రణకు అధికారులు చేస్తున్న చర్యలకు ప్రజలు, ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సహకరించాలని కోరారు. 12 గంటలు దాటాక కారణం లేకుండా బయట తిరిగితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన రహదారుల్లో పోలీసు అధికారులతో కలసి ప్రజలకు, వాహనదారులకు కర్ఫ్యూపై, కరోనా ఉధృతిపై అవగాహన కల్పించారు. సీఐ వెంకటనారాయణ, ఎస్సై గణేష్‌కుమార్‌, పండుదొర, రాజారెడ్డి  పాల్గొన్నారు.


Updated Date - 2021-05-05T05:45:22+05:30 IST