కాకాని జీవితం నేటితరానికి ఆదర్శం

ABN , First Publish Date - 2021-12-26T06:24:44+05:30 IST

కాకాని జీవితం నేటితరానికి ఆదర్శం

కాకాని జీవితం నేటితరానికి ఆదర్శం
కాకాని వెంకటరత్నం విగ్రహం వద్ద నివాళులర్పిస్తున్న చలసాని ఆంజనేయులు

విజయ డెయిరీ చైర్మన్‌  చలసాని ఆంజనేయులు 

 హనుమాన్‌జంక్షన్‌, డిసెంబరు 25 : పాడిపరిశ్రమ అభివృద్ధికి బాట వేసిన కాకాని వెంకటరత్నం సేవలు  మరువ లేనివని విజయ డెయిరీ చైర్మన్‌  చలసాని ఆంజనేయులు అన్నారు. శనివారం కాకాని  వర్ధంతి సందర్భంగా స్థానిక  విజయ వాడ రోడ్డులో కృష్ణామిల్క్‌ యూనియన్‌ ఆధ్వర్యంలోని  కాకాని  కళ్యాణం మండపం వద్ద కాకాని విగ్రహానికి చలసాని పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చల సాని మాట్లాడుతూ మంత్రిగా ఉన్నపుడు కాకాని పాడి రైతులకు మేలు చేసేలా ఎన్నో సంస్కరణలు తెచ్చిన గొప్ప వ్యక్తి అన్నారు. స్వాత్రంత్య ఉద్యమ నేతగా, జై ఆంధ్రా ఉద్యమ స్ఫూర్తిని రగిలించి ఉక్కు మనిషిగా కీర్తి గడించిన కాకాని జీవితం నేటి తరం రాజకీయ నేతలకు ఆదర్శనీయమని పేర్కొన్నారు. కార్యక్రమంలో విజయ డెయిరీ జిల్లా ట్రస్ట్‌ బోర్డు డైరెక్టర్‌ పిన్నమనేని లక్ష్మీప్రసాద్‌, హనుమాన్‌జంక్షన్‌ మిల్క్‌ చిల్లింగ్‌ సెంటర్‌ మేనేజర్‌ వి.వి.సంపత్‌ కుమార్‌, బాపులపాడు, రంగన్నగూడె, మీర్జాపురం, అప్పారావుపేట, సొసైటీ అధ్యక్షులు  విజయ్‌,  మొవ్వా శ్రీనివాసరావు, లింగం శ్రీధర్‌, సత్యనారాయణ, సూపర్‌వైజర్లు, సిబ్బంది పాల్గొన్నారు. 

ముదునూరులో..

ముదునూరు(ఉయ్యూరు)  :  దివంగత మాజీ మంత్రి  కాకాని వెంకటరత్నం వర్ధంతి పురస్కరించుకుని శనివారం  ముదునూరులో ఆయన విగ్రహానికి  సర్పంచ్‌ మొవ్వ వెంకట నాగలక్ష్మి, పీఏసీఎస్‌ చైర్మన్‌ పాలడుగు సత్యనారాయణ, మాజీ సర్పంచ్‌ జ్ఞానశేఖర్‌, మండల వైసీపీ అధ్యక్షుడు  దాసే రవి ఆధ్వర్యంలో పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ  విద్య, వైద్య రంగాలతో పాటు సాగునీటి సదుపాయాల అభివృద్ధిలో కాకాని చేసిన కృషిని ప్రజలు మరువలేరన్నారు. పాల విప్లవాన్ని సాధించి, గ్రామీణ ప్రాంత ప్రజల జీవన స్థితిగతులు మెరుగు పరిచేందుకు కాకాని కృషిని చిన్న  రైతులు మరచి పోరని గుర్తుచేశారు. దాకవరపు అజయ్‌,  తెలంగాణా బీసీ సెల్‌  అధ్యక్షుడు   భగవాన్‌దాస్‌, వందనపు సత్యనారాయణ నివాళులర్పించారు. 

ఆకునూరులో.. 

ఆకునూరులో మాజీ సర్పంచ్‌ కాకాని విజయ్‌కుమార్‌, గార పాటి నాని ఆధ్వర్యంలో కాకాని వెంకటరత్నం వర్ధంతి నిర్వ హించి, ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పిం చారు. జిల్లాలో విద్య, పాడి పరిశ్రమ అభివృద్ధికి  ఆయన చేసిన కృషిని ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఆకునూరు గ్రామానికి  చెందిన వాడు కావడం గర్వకారణమని గారపాటి నాని, మేరుగుమాల యేసుబాబు, ఆరేపల్లి శ్రీను అన్నారు.

Updated Date - 2021-12-26T06:24:44+05:30 IST