జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి

ABN , First Publish Date - 2021-08-20T06:05:08+05:30 IST

వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చావల జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు.

జ్యోతి కుటుంబానికి న్యాయం చేయాలి

 ప్రభుత్వ ఆస్పత్రి వద్ద ఏఎన్‌ఎంల ఆందోళన

మైలవరం రూరల్‌, ఆగస్టు 19 : వెంకటాపురం వద్ద రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చావల జ్యోతి కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో ఏఎన్‌ఎంలు మైలవరం ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట ఆందోళనకు దిగారు. కుటుంబంలోని ఇద్దరు పిల్లల చదువుకయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించాలని, ఇంటి స్థలం, ఇద్దరి పిల్లల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఆందోళన తెలుసుకున్న మైలవరం, జి.కొండూరు ఎస్సైలు రాంబాబు, ధర్మరాజు, సర్పంచ్‌ మంజుభార్గవి, ఏఎంసీ చైర్మన్‌ పామర్తి శ్రీనివాసరావు ఆసుపత్రి వద్దకు చేరుకొని ఏఎన్‌ఎంలతో మాట్లాడారు. తహసీల్దార్‌ వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాలని ఏఎన్‌ఎంలు కోరారు. తహసీల్దార్‌ రోహిణిదేవి ఏఎన్‌ఎంలతో మాట్లాడారు. జ్యోతి విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళతానని ఆమె హామీ ఇచ్చారు. డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని ఏఎన్‌ఎంలు తహసీల్దార్‌కు అందజేసి ఆందోళన విరమించారు. ఆందోళనలో సీఐటీయు జిల్లా కార్యదర్శి మహేష్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-08-20T06:05:08+05:30 IST