ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించండి

ABN , First Publish Date - 2021-12-07T06:23:17+05:30 IST

జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులు దృష్టి సారించాలని జేసీ మాధవీలత సూచించారు.

ధాన్యం కొనుగోళ్లపై దృష్టి సారించండి

 రైతులకు అవగాహన సదస్సులు నిర్వహించాలి 

జేసీ మాధవీలత

 ఆంధ్రజ్యోతి-మచిలీపట్నం : జిల్లాలో ధాన్యం కొనుగోళ్లపై అధికారులు దృష్టి సారించాలని జేసీ మాధవీలత సూచించారు. స్పందన కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో జేసీలతో  ప్రజల నుంచి ఆమె అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంగళవారం అధికారులు పరిశీలన చేయాలన్నారు.  కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు జరిగే తీరును రైతులకు వివరించేందుకు అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. రైతులు ధాన్యం విక్రయించాలంటే ఈ-క్రాప్‌ నమోదుతోపాటు ఈకేవైసీ చేయిస్తే ధాన్యం కొనుగోళ్లు సులభతరమవుతాయన్నారు. ఓటర్ల నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు ర్యాలీలు, అవగాహన సదుస్సులు ఏర్పాటు చేయాలన్నారు. జేసీ శివశంకర్‌ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు ప్రొబేషన్‌ అర్హత సాధించిన వారి జాబితాలను పంపాలన్నారు. జేసీ నూపూరు శ్రీవాస్‌ ఆజయ్‌కుమార్‌ మాట్లాడుతూ జగనన్న శాశ్వత గృహహక్కు పథకం అమలును వేగవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జేసీ మోహనరావు, డీఆర్వో వెంకటేశ్వర్లు, జడ్పీ సీఈవో సూర్యప్రకాశరావు, డ్వీమా పీడీ జీవీ సూర్యనారాయణ, హౌసింగ్‌ పీడీ రామచంద్రన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-07T06:23:17+05:30 IST