పవన్‌ కల్యాణ్‌ విశాఖ యాత్రను జయప్రదం చేయండి : రామకృష్ణ

ABN , First Publish Date - 2021-10-29T06:40:43+05:30 IST

విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 31న విశాఖపట్నంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు.

పవన్‌ కల్యాణ్‌ విశాఖ యాత్రను జయప్రదం చేయండి :  రామకృష్ణ

మచిలీపట్నం టౌన్‌, అక్టోబరు 28 : విశాఖ ఉక్కు పరిరక్షణ కోసం ఈనెల 31న విశాఖపట్నంలో జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పవన్‌కల్యాణ్‌ చేపట్టిన యాత్రను విజయవంతం చేయాలని జనసేన జిల్లా అధ్యక్షుడు బండ్రెడ్డి రామకృష్ణ అన్నారు. గురువారం మచిలీపట్నంలో జనసేన పార్టీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేయడాన్ని అంద రూ ముక్తకంఠంతో ఖండించాలన్నారు. నియోజకవర్గ ఇన్‌చార్జి బండి రామకృష్ణ మాట్లాడుతూ, రాజకీయాలకు అతీతంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను వ్యతిరేకించాలన్నారు.  జిల్లా ప్రధాన కార్యదర్శి లంకిశెట్టి బాలాజీ, ఉపాధ్యక్షుడు వంపుగడల చౌదరి, జన్ను నాగరాజు, సురేష్‌, గిరి, చక్రి, మైకేల్‌, రమేష్‌, పవన్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-10-29T06:40:43+05:30 IST