ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

ABN , First Publish Date - 2021-01-13T06:09:48+05:30 IST

ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేయాలి

విజయవాడ సిటీ: ముస్లింల హక్కులను కాలరాస్తున్న వైసీపీ ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్‌ చేయాలని, రాష్ట్రంలో గవర్నర్‌ పాలన  పెట్టాలని నవరంగ్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జలీల్‌ డిమాండ్‌ చేశారు. గాంధీనగర్‌లోని ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌ మీట్‌లో ఆయన మాట్లాడారు. ఎన్నికల కమిషనర్‌ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత కాదనే హక్కు ఎవరికీ లేదన్నారు. ఎన్నికల అధికారిని అపహాస్యం చేసేలా వైసీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు మాట్లాడటం అప్రజాస్వామికమన్నారు. 


Updated Date - 2021-01-13T06:09:48+05:30 IST