2,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ABN , First Publish Date - 2021-05-02T05:36:58+05:30 IST

2,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

2,600 లీటర్ల బెల్లపు ఊట ధ్వంసం

ఆగిరిపల్లి, మే 1: మండల పరిధిలోని సింహాద్రి అప్పారావుపేటలో నూజివీడు  స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ స్టేషన్‌ సిబ్బంది కాపుసారా బట్టీలపై దాడులు చేసి 2,600 లీటర్ల బెల్లపు ఊటను ధ్వంసం చేసి, ఇద్దరిపై కేసు నమోదు చేసినట్టు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ సీఐ ఎస్‌.సాయిస్వరూప్‌ తెలిపారు. గ్రామంలో విచ్చలవిడిగా కాపుసారా బట్టీలు పెట్టి సారా తయారీ చేస్తుండటంతో శనివారం తమ సిబ్బందితో దాడులు చేశామన్నారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని ఆయన తెలిపారు.

Updated Date - 2021-05-02T05:36:58+05:30 IST