తొలిరోజు ఐటీఐ కౌన్సెలింగ్‌కు 221 మంది హాజరు

ABN , First Publish Date - 2021-08-28T04:55:36+05:30 IST

తొలిరోజు ఐటీఐ కౌన్సెలింగ్‌కు 221 మంది హాజరు

తొలిరోజు ఐటీఐ కౌన్సెలింగ్‌కు 221 మంది హాజరు

పటమట, ఆగస్టు 27 : 2021-22 విద్యా సంవత్సరానికి ఐటీఐ ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల్లో మెరిట్‌ ఆధారంగా తొలిరోజు నిర్వహించిన కౌన్సెలింగ్‌కు 221 మంది హాజరైనట్లు ఐటీఐ జిల్లా కన్వీనర్‌ గొంది హరి ధర్మేంద్ర తెలిపారు. విజయవాడ ఐటీఐ కళాశాల ప్రాంగణంలో శుక్రవారం కౌన్సెలింగ్‌ జరిగింది. ఈ సందర్భంగా ధర్మేంద్ర మాట్లాడుతూ కౌన్సెలింగ్‌కు 337 మంది హాజరుకావాల్సి ఉండగా, 221 మంది హాజరయ్యారని, ఇంటర్వ్యూ నిర్వహించి 175 మందిని ఎంపిక చేసినట్లు తెలిపారు. శనివారం ఉదయం 8 గంటలకు మెరిట్‌ నెంబర్‌ 338 నుంచి 485 వరకు, మధ్యాహ్నం 2 గంటలకు 486 నుంచి 614 వరకు కౌన్సెలింగ్‌ జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులు పదో తరగతి ఒరిజినల్‌ మార్కుల లిస్టు పొందకపోతే ఆన్‌లైన్‌లోని మార్కుల లిస్టుపై సంబంధిత పాఠశాల హెచ్‌ఎంతో సంతకం (అటెస్టెడ్‌) చేయించుకుని తీసుకురావాలని          ధర్మేంద్ర సూచించారు.

Updated Date - 2021-08-28T04:55:36+05:30 IST