ఉపాధ్యాయుడి దాష్టీకంపై విచారణ
ABN , First Publish Date - 2021-11-26T06:16:46+05:30 IST
దేచుపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు చేసిన దాష్టీకంపై గురువారం వత్సవాయి ఎంఈవో నాగరాజు విచారణ జరిపారు.

జగ్గయ్యపేట(వత్సవాయి), నవంబరు 25: దేచుపాలెం ఆదర్శ పాఠశాలలో విద్యార్థులపై ప్రధానోపాధ్యాయుడు చేసిన దాష్టీకంపై గురువారం వత్సవాయి ఎంఈవో నాగరాజు విచారణ జరిపారు. పత్రికల్లో వచ్చిన కథనాలపై స్పందించిన డీఈవో విచారణకు ఆదేశించారు. ఎంఈవో పాఠశాలకు వెళ్లి తల్లిదండ్రులు, స్కూల్ నిర్వహణ కమిటీ సభ్యులు, అందుబాటులో ఉన్న విద్యార్థులను విచారించారు. హెచ్‌ఎం మంగ్యానాయక్‌ను విచారించారు. క్రమశిక్షణ కోసం విద్యార్థులను దండించినట్టు అంగీకరించారని, మరికొంతమంది పిల్లలను విచారించాల్సి ఉందని తెలిపారు. విచారణ అనంతరం నివేదికను ఉన్నతాధికారులకు అందజేస్తానని ఎంఈవో తెలిపారు.