రేపు జిల్లాకు ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక

ABN , First Publish Date - 2021-10-29T06:34:00+05:30 IST

భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈనెల 30న ప్రత్యేక విమానంలో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకుంటారు.

రేపు జిల్లాకు ఉప రాష్ట్రపతి వెంకయ్య రాక

పాయకాపురం, అక్టోబరు 28 : భారత ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు ఈనెల 30న ప్రత్యేక విమానంలో విజయవాడ (గన్నవరం) విమానాశ్రయానికి చేరుకుంటారు. ఈనెల 30న శనివారం ఉద యం 11.30 గంటలకు విమానాశ్రయానికి చేరుకుని అక్కడి నుంచి ఉదయం 11.40 గంటలకు బయలుదేరి 11.55 గంటలకు ఆత్కూరులోని స్వర్ణభారత్‌ ట్రస్టుకు చేరుకుంటారు. సాయంత్రం 4గంటల నుం చి 5.30 గంటల వరకు ట్రస్టులో నిర్వహించే డా.ఐవి. సుబ్బారావు రైతు నేస్తం వార్షిక అవార్డ్స్‌-2021లో ముఖ్య అతిథిగా పాల్గొంటారు. 31న ఆదివారం ఉదయం 8.30 గంటలకు స్వర్ణభారత ట్రస్టులో సర్దార్‌ వల్లభాయి పటేల్‌ జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పిస్తారు. ఉదయం 8.45 గంటలకు ఆత్కూరులోని స్వర్ణభారత ట్రస్టు నుంచి బయలుదేరి ఉదయం 9.15 గంటలకు బందరు రోడ్డు కృష్ణలంకలోని రామమోహన్‌ లైబ్రరీని సందర్శిస్తారు. తిరిగి ఉదయం 9.30 గంటలకు బయలు దేరి ఉదయం 10గంటలకు స్వర్ణభారత ట్రస్టుకు చేరుకుంటారు. ఉదయం 10.30 గంటలకు ఎయిమ్స్‌ సంస్థ డైరెక్టర్‌ ప్రజంటేషన్‌ను పరిశీలిస్తారు. నవంబరు 1న సోమవారం ఉదయం 9.45 గంటలకు ఆత్కూరు స్వర్ణ భారత ట్రస్ట్‌ నుంచి బయలుదేరి ఉదయం 9.55 గంటలకు చిన్నఅవుటపల్లిలోని డాక్టర్‌ పిన్నమనేని సిద్ధార్థ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్స్‌ అండ్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ను చేరుకుని ఉదయం 10 గంటలకు 1200 ఎల్‌పీఎం, పీఎ్‌సఏ (ఆక్సిజన్‌) ప్లాంటును ప్రారంభించి, విద్యార్థులు, అధ్యాపకులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. తిరిగి ఉదయం 11.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి ఉదయం 11.37 గంటలకు స్వర్ణభారత ట్రస్ట్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 గంటలకు ఐఐపీఏ సర్వసభ్య సమావేశంలో వర్చువల్‌ పద్ధతిలో పాల్గొంటారు. నవంబరు 2న ఉదయం 8.35 గంటలకు విజయవాడ విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి విశాఖపట్నం వెళ్తారు. 

రామమోహన్‌ లైబ్రరీలో ఏర్పాట్లపై కలెక్టర్‌ సమీక్ష

గవర్నర్‌పేట : స్థానిక ఎంజీ రోడ్డులోని పురాతన రామమోహన్‌ పౌర గ్రంథాలయాన్ని కలెక్టర్‌ కె.నివాస్‌ గురువారం సందర్శించారు. ఈనెల 31 న ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు గ్రంథాలయ సందర్శనకు రానున్నారు. అక్కడి ప్రాంగణంలో భారతమా త విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో ఏర్పాట్లు పరిశీలనకు కలెక్టర్‌ గ్రంథాలయా న్ని సందర్శించారు. ఏర్పాట్లుపై గ్రంథాలయ కమిటీ సభ్యులతో సమీక్షించారు. పురాతన పుస్తకాలను ఆసక్తిగా పరిశీలించారు. సీపీ బత్తిన శ్రీనివాసులు, జేసీ (అభివృద్ధి) ఎల్‌. శివశంకర్‌, రామమోహన్‌ గ్రంథాలయ కమిటీ అధ్యక్షుడు సిహెచ్‌ కోటేశ్వరరావు, వైస్‌ ప్రెసిడెంట్‌ పి. రామచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - 2021-10-29T06:34:00+05:30 IST