సిద్ధార్థ మహిళా కళాశాలలో గీతా జయంతి వేడుకలు

ABN , First Publish Date - 2021-12-15T06:18:00+05:30 IST

సిద్ధార్థ మహిళా కళాశాలలో మంగళవారం కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

సిద్ధార్థ మహిళా కళాశాలలో గీతా జయంతి వేడుకలు
గీతా శ్లోకాల పోస్టర్‌ను తిలకిస్తున్న డైరెక్టర్‌ టి. విజయలక్ష్మీ, ప్రిన్స్‌పాల్‌ ఎస్‌. కల్పన తదితరులు

 సిద్ధార్థ మహిళా కళాశాలలో గీతా జయంతి వేడుకలు

 లబ్బీపేట, డిసెంబరు 14: సిద్ధార్థ మహిళా కళాశాలలో మంగళవారం కళాశాల తెలుగు విభాగం ఆధ్వర్యంలో గీతా జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సంద ర్భంగా కళాశాల డైరెక్టర్‌ డాక్టర్‌ టి. విజయలక్ష్మి మాట్లాడుతూ మార్గశిర శుద్ధ ఏకాదశిని గీతా జయంతిగా ఆచరిస్తారని శ్రీ కృష్ణ భగీవానుడు అర్జునుడికి గీతోపదేశం చేసింది ఈ ఏకాదశి రోజునే కాబట్టి గీతా జయంతిగా ప్రసిద్ధి చెందిందని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు గీతా శ్లోక పఠనంలో పోటీలు నిర్వహించి బముమతులు అందజేశారు. గీతా శ్లోకాల పోస్టర్‌ ప్రదర్శన ద్వారా గీతా సందేశం ప్రాముఖ్యతను  విద్యార్థినులు చక్కగా వివరించారు. ప్రిన్స్‌పాల్‌ ఎస్‌.కల్పన, ఎ. నాగజ్యోతి, కె. సరళ, వి. మంజుల, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-15T06:18:00+05:30 IST