పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి
ABN , First Publish Date - 2021-09-03T06:24:12+05:30 IST
పెంచిన గ్యాస్ ధరలు తగ్గించాలి

భవానీపురం, సెప్టెంబరు 2: వంట గ్యాస్ ధరలు అడ్డూ అదుపూ లేకుండా పెరిగిపోతున్నా ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పట్టించుకోవడం లేదని సీపీఎం పశ్చిమ నగర కమిటీ నాయకుడు ఎల్. మోహన్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. 44వ డివిజన్ కొండబడి ప్రాంతంలో వంట గ్యాస్ ధరల పెంపును నిరసిస్తూ సీపీఎం ఆధ్వర్యంలో మహిళలు గురువారం నిరసన తెలిపారు. రోడ్డుపై కట్టెల పొయ్యి వెలిగించి రాబోయే కాలంలో ఇదే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. పెట్రోల్, డీజిల్ ధరలు అమాంతంగా పెరగడం, నిత్యావసరాల ధరలకు రెక్కలు రావడంతో పాటు గ్యాస్ ధర ప్రజలకు అదనపు భారంగా మారిందని మోహన్‌రావు అన్నారు. శాఖా కార్యదర్శులు శ్రీను, సీతారామయ్య, మంగ, రాజేశ్వరి, లక్ష్మి పాల్గొన్నారు.