నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉచిత శిక్షణ

ABN , First Publish Date - 2021-01-13T06:18:30+05:30 IST

రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌జీబీఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణా కార్యక్రమం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ప్రణయ్‌ మంగళవారం తెలిపారు.

నైపుణ్యాభివృద్ధి సంస్థ ఉచిత శిక్షణ

కంచికచర్ల రూరల్‌ : రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఎస్‌జీబీఎస్‌ ఉన్నతి ఫౌండేషన్‌ సంస్థ ఆధ్వర్యంలో 35 రోజుల పాటు ఉచిత భోజన వసతితో కూడిన శిక్షణా కార్యక్రమం బెంగళూరులో నిర్వహిస్తున్నట్లు జిల్లా స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అధికారి ప్రణయ్‌ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిజినెస్‌ అసోసియేట్‌, ఫీల్డ్‌ సేల్స్‌, రిటైల్‌ అసోసియేట్‌, బ్యుటీషియన్‌, గెస్ట్‌ కేర్‌ హోటల్‌, టాలీతో పాటు ఉద్యోగ రీత్యా అవసరమైన స్కిల్స్‌పై శిక్షణనివ్వటం జరుగుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9963425999 సంప్రదించాలని కోరారు.

Updated Date - 2021-01-13T06:18:30+05:30 IST