ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు
ABN , First Publish Date - 2021-07-24T06:18:42+05:30 IST
ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

కంచికచర్ల రూరల్: మండలంలోని చెవిటికల్లు సమీపంలోని లక్ష్మయ్య వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో ప్రజలు రాకపోకలు సాగించకుండా చెక్‌పోస్టు ఏర్పాటు చేసినట్లు ఆర్‌ఐ శిరీష, సర్పంచ్ బుడ్డి విజయలక్ష్మి పేర్కొన్నారు. గ్రామంలోని లక్ష్మయ్య వాగును శుక్రవారం వారు పరిశీలించారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారని నదీ పరివాహక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని, పశువుల కాపరులు లంకకు వెళ్లవద్దని సూచించారు. కార్యదర్శి కనగాల రవికుమార్ పాల్గొన్నారు.