వైరా-కట్టలేరులకు భారీ వరద

ABN , First Publish Date - 2021-07-24T06:12:31+05:30 IST

వైరా-కట్టలేరులకు భారీ వరద

వైరా-కట్టలేరులకు భారీ వరద
దొడ్డదేవరపాడు కాజ్‌వేపై ఉధృతంగా ప్రవహిస్తున్న కట్టలేరు

వీరులపాడు: తెలంగాణలో కురిసిన భారీ వర్షాలకు వైరా - కట్టలేరులకు భారీగా వరదనీరు వచ్చి చేరింది. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచాయి. పల్లెంపల్లి నుంచి కూడలి వెళ్లే రహదారి వీరులపాడు వద్ద తోటమూల నుంచి దొడ్డదేవరపాడు వెళ్లే కాజ్‌వే పై మూడు అడుగుల మేర నీరు ప్రవహించటంతో ఈ గ్రామానికి పూర్తిగా రాకపోకలు నిలిచాయి. వెల్లంకి నుంచి కొణతాలపల్లి వెళ్లే ఆర్‌అండ్‌బీ రహదారిపై వైరా ఏటి నుంచి వచ్చిన వరదనీరు చేరటంతో ప్రజలు అటుగా వెళ్లేందుకు ఇబ్బందులు పడ్డారు. ఏనుగుగడ్డ వాగు ఉధృతికి పెద్దాపురం నుంచి గూడెంమాధవరం వెళ్లేందుకు, జుజ్జూరు నుంచి రంగాపురం వెళ్లేందుకు, నరసింహారావుపాలెం నుంచి గ్రామశివారుల్లో ఉన్న ఫ్యాక్టరీలకు వెళ్లేందుకు వీలు కాకపోవటంతో రాకపోకలు పూర్తిగా స్తంభించాయి. ఎస్సై సోమేశ్వరరావు రాకపోకలు నిలిచిన గ్రామాల వైపు ప్రయాణించకుండా చర్యలు చేపట్టారు. 


Updated Date - 2021-07-24T06:12:31+05:30 IST