ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు
ABN , First Publish Date - 2021-02-01T06:39:36+05:30 IST
ప్రశాంతతకు భంగం కలిగిస్తే చర్యలు

విజయవాడ రూరల్, జనవరి 31 : గ్రామాల్లో ప్రశాంత వాతా వరణానికి భంగం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని నార్త్ జోన్ ఏసీపీ షేక్ షాను హెచ్చరించారు. ఆదివారం నున్న, పాత పాడు గ్రామాల్లో నున్న రూరల్ పోలీసు సిబ్బందితో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవటానికి అందరూ సహకరించాలని కోరారు. సీఐ ఎం. ప్రభాకర్, ఎస్సైలు రాజు, హైమావతి పాల్గొన్నారు.