కనుల పండువగా వసంతోత్సవం

ABN , First Publish Date - 2021-03-14T06:04:37+05:30 IST

కనులపండువగా ఆది దంపతుల వసంతోత్సవం జరిగింది.

కనుల పండువగా వసంతోత్సవం
కృష్ణానదిలో ఉత్సవమూర్తులకు వసంతోత్సవం

ఇంద్రకీలాద్రిపై శివరాత్రి ఉత్సవాల పూర్ణాహుతి 

విజయవాడ, మార్చి 13 (ఆంధ్రజ్యోతి) :  కనులపండువగా ఆది దంపతుల వసంతోత్సవం జరిగింది. ఇంద్రకీలాద్రిపై కొనసాగుతున్న మహా శివరాత్రి ఉత్సవాల్లో భాగంగా శనివారం గంగా పార్వతీ సమేత మల్లేశ్వరస్వామి ఉత్సవమూర్తులకు పవిత్ర కృష్ణానదిలో వసంతోత్సవం (అవభృ దోత్సవం) నిర్వహించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆదిదంపతుల ఉత్సవ మూర్తులను మల్లేశ్వరస్వామి ఆలయం నుంచి పల్లకీలో దుర్గాఘాట్‌కు తీసుకువచ్చారు. ఆలయ వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య ఉత్సవ మూర్తులకు నది జలాలతో శాస్త్రోక్తంగా వసంతోత్సవం నిర్వహించారు. 

అంతకుముందు దేవస్థానంలోని యాగశాలలో మహాశివరాత్రి ఉత్సవాల పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ స్థానాచార్యుడు శివప్రసాదశర్మ, వైదిక కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమాల్లో ఆలయ ఈవో ఎం.వి.సురేష్‌బాబు దంపతులు పాల్గొని పూజలు చేశారు.Updated Date - 2021-03-14T06:04:37+05:30 IST