పోలీసులు చోద్యం చూస్తున్నారా?

ABN , First Publish Date - 2021-10-21T06:48:13+05:30 IST

పోలీసులు చోద్యం చూస్తున్నారా?

పోలీసులు చోద్యం చూస్తున్నారా?

మాజీ ఎంపీ కొనకళ్ల ఫైర్‌

మచిలీపట్నం, ఆంధ్రజ్యోతి : టీడీపీ కార్యాలయాలపై వైసీపీ నాయకులు దాడులకు తెగబడుతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారని మాజీ ఎంపీ కొనకళ్ల నారాయణరావు మండిపడ్డారు. టీడీపీ రాష్ట్ర బంద్‌ పిలుపు మేరకు బుధవారం పోలీసులు ఆయన్ను గృహ నిర్బంధం చేశారు. ఈ సందర్భంగా కొనకళ్ల మాట్లాడుతూ గృహ నిర్బంధాలతో ఉద్యమాలను అణచివేయలేరన్నారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కోరారు. కాగా, బంద్‌ నేపథ్యంలో మచిలీపట్నం చేరుకునే నలువైపులా కూడళ్లలో పోలీసులు పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. 

Updated Date - 2021-10-21T06:48:13+05:30 IST