ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారు: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

ABN , First Publish Date - 2021-05-02T05:42:36+05:30 IST

ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారు: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

ప్రజల ప్రాణాలు గాలికొదిలేశారు: మాజీ ఎమ్మెల్యే స్వామిదాసు

తిరువూరు, మే 1: పట్టణం, మండలంలోని గ్రామాల్లో కరోనా సెకండ్‌ వేవ్‌తో మృతుల సంఖ్య పెరుగుతున్నా, వైరస్‌ వ్యాప్తి కట్టడికి చర్యలు తీసుకోకుండా ఎమ్మెల్యేతో పాటు అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ప్రజల ప్రాణాలు గాలికి వదిలివేశారని మాజీ ఎమ్మెల్యే, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లగట్ల స్వామిదాసు విమర్శించారు. ప్రభుత్వ వైద్యశాలలో కొవిడ్‌ పరీక్షలు చేయడం లేదని, గుర్తుకువచ్చినప్పుడు చేసే ఆర్టీపీసీఆర్‌ పరీక్షల ఫలితాలు సకాలంలో ఇవ్వడం లేదని ఆయన అన్నారు. దీంతో వైరస్‌ సోకినవారు బహిరంగంగానే తిరుగుతున్నారని, కరోనా వ్యాప్తి చెందుతోందని ఆయన ఆరోపించారు. విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఎమ్మెల్యే ఎక్కడో దూరంగా ఉండటం సబబుకాదని, తక్షణం పట్టణంలో వైరస్‌వ్యాప్తిని అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని, ర్యాపిడ్‌ టెస్టులు చేయాలని, రోగులకు మందులు అందించాలని,  కొవిడ్‌కేర్‌ సెంటర్‌ ఏర్పాటు చేయాలని స్వామిదాసు డిమాండ్‌ చేశారు.  

Updated Date - 2021-05-02T05:42:36+05:30 IST