ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులుండాలి

ABN , First Publish Date - 2021-12-09T06:32:34+05:30 IST

ఉపాధిహామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వాటర్‌ షెడ్‌ డైరెక్టర్‌ పి.వి.ఆర్‌.ఎం.రెడ్డి, శానిటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీలు అన్నారు.

ప్రజలు, రైతులకు ఉపయోగపడేలా ఉపాధి పనులుండాలి
చెక్‌డ్యామ్‌ వద్ద పనులు పరిశీలిస్తున్న అధికారుల బృందం

వీరులపాడు, డిసెంబరు 8 : ఉపాధిహామీ పథకం కింద చేపట్టే ప్రతీ పని ప్రజలకు, రైతులకు ఉపయోగపడే విధంగా ఉండాలని రాష్ట్ర వాటర్‌ షెడ్‌ డైరెక్టర్‌ పి.వి.ఆర్‌.ఎం.రెడ్డి, శానిటేషన్‌ డిప్యూటీ కమిషనర్‌ భవానీలు అన్నారు.  జగన్నాథపురం, గోకరాజుపల్లిల్లో 2020-21 సంవత్సరానికి ఉపాధిహామీ కింద చేపట్టిన పంటకాల్వల్లో పూడికతీత, మొక్కలపెంపకం, చెక్‌డ్యామ్‌ నిర్మాణ పనులను పరిశీలించారు. కార్యక్రమంలో డ్వామా డైరెక్టర్‌ సూర్యనారాయణ, ఏపీడీ శ్రీనివాసరావు, ఎంపీడీవో రామకృష్ణ నాయక్‌, ఏపీవో జనార్థన్‌ పాల్గొన్నారు. 


Updated Date - 2021-12-09T06:32:34+05:30 IST