ఉద్యోగులూ.. సమయపాలన పాటించండి

ABN , First Publish Date - 2021-08-27T06:15:37+05:30 IST

గ్రామ సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు.

ఉద్యోగులూ.. సమయపాలన పాటించండి
పామర్రులో ఉద్యోగులతో మాట్లాడుతున్న జేసీ మాధవీలత

గ్రామ సచివాలయాల్లో జేసీ మాధవీలత తనిఖీలు

పామర్రు, ఆగస్టు 26 : గ్రామ సచివాలయాల ఉద్యోగులు సమయపాలన పాటిస్తూ ప్రజలకు సేవలందించాలని జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ కె.మాధవీలత అన్నారు. పామర్రులో 3, 4, 5 గ్రామ సచివాలయాలను గురువారం ఆకస్మిక తనిఖీ చేశారు.  జేసీ మాట్లాడుతూ,  ప్రతిఒక్క ఉద్యోగికి బయో మెట్రిక్‌ హాజరు తప్పనిసరి అన్నారు. కోండిపర్రు, జిజ్జువరం గ్రామ సచివాలయాలను మండల ప్రత్యేకాధికారి డి.విజయ లక్ష్మి, ఎంపీడీవో వై.రామకృష్ణతో కలిసి తనిఖీలుచేసి పలు సూచనలు చేశారు. పథకాలు, లబ్ధిదారుల వివరాలు సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. సిబ్బంది విధుల పట్ల అలసత్యం చూపితే క్రమశిక్షణా చర్యలు తప్పవన్నారు. కార్యాలయాల్లో రికార్డులను పరిశీలించారు. పెండింగ్‌ అర్జీలను త్వరగా పరిష్కరించాలని జేసీ మాధవీలత ఆదేశించారు. తెల్ల రేషన్‌ కార్డులున్న ప్రభుత్వ ఉద్యోగులు, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌, గ్రామసచివాలయాల్లో పనిచేస్తున్న  ఉద్యోగులు తక్షణమే వాటిని ప్రభుత్వానికి అప్పగించి సహకరించాలని, లేనిపక్షంలో క్రిమినల్‌ చర్యలు తప్పవని హెచ్చరించారు.


రైస్‌ మిల్లుల్లో తనిఖీలు

 రెండు రైస్‌ మిల్లులను జేసీ మాధవీలత,  సివిల్‌ సప్లై అధికారిణి రాజ్యలక్ష్మితో కలిసి తనిఖీ చేశారు. ఒక రైస్‌ మిల్లుకు లైసెన్స్‌ గడువు ముగియడాన్ని గుర్తించారు. రెండు రోజుల్లో రెన్యూవల్‌ చేసి చూపాలని  ఆదేశించారు. స్టాక్‌ను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.  తహసీల్దార్‌ నూతక్కి సురేష్‌బాబు, పీడీఎస్‌డీటీ భవాని, ఆర్‌ఐ కృష్ణాకిషోర్‌, కార్యదర్శులు మణికంఠ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-08-27T06:15:37+05:30 IST