బర్డ్‌ ఫ్లూ భయం లేదు.. చికెన్‌ తినొచ్చు!

ABN , First Publish Date - 2021-01-20T06:50:31+05:30 IST

కోళ్లకు బర్డ్‌ ఫ్లూ భయం లేదని, చికెన్‌ వల్ల మనుషులకు సంక్రమించదని కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేయటంతో జిల్లాలోని పౌల్ర్టీ రంగం ఊపిరి పీల్చుకుంది.

బర్డ్‌ ఫ్లూ భయం లేదు.. చికెన్‌ తినొచ్చు!

ఆంధ్రజ్యోతి, విజయవాడ : కోళ్లకు బర్డ్‌ ఫ్లూ భయం లేదని, చికెన్‌ వల్ల మనుషులకు సంక్రమించదని కేంద్ర ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేయటంతో  జిల్లాలోని పౌల్ర్టీ రంగం ఊపిరి పీల్చుకుంది. బర్డ్‌ ఫ్లూ భయంతో కనుమ అనంతరం చికెన్‌ విక్రయాల్లో తగ్గుదల కనిపించింది. అలాగే గుడ్లకు కూడా డిమాండ్‌ తగ్గింది. అనుకోని ఈ ఉపద్ర వంతో పౌల్ర్టీ పరిశ్రమ ఆందోళ నకు గురైంది. జిల్లాలో గన్నవరం, నూజివీడు, హనుమాన్‌ జంక్షన్‌, చల్లపల్లి వంటి ప్రాంతాల్లో పౌల్ర్టీ రంగం భారీస్థాయిలో ఉంది. జిల్లావ్యాప్తంగానూ మధ్య తరహా పౌల్ర్టీ రంగం ఉంది. కోడి మాంసం, గుడ్డును ఉడికించటం వల్ల ఏ వైరస్‌ ఉన్నా చనిపోతుందని నిరూపణ అయినందునే కేంద్రం ప్రభుత్వం సానుకూలంగా మార్గదర్శకాలు జారీ చేసిందని జిల్లాకు చెందిన సీనియర్‌ పౌల్ర్టీ ఫార్మర్‌ మూలూర్పు లక్ష్మణస్వామి ఆంధ్రజ్యోతికి చెప్పారు.

Updated Date - 2021-01-20T06:50:31+05:30 IST